అయితే నేటి ఉరుకులు పరుగులు జీవితంలో పిల్లలు పట్టించుకునే తీరికే తల్లిదండ్రులకు ఉండడం లేదు. దీనివల్ల పిల్లలువమంచి, చెడు మధ్య వ్యత్యాసం తెలియక అల్లరచిల్లరగా తయారవుతున్నారు.
పిల్లలను ఎల్లప్పుడూ ప్రోత్సహించాలి. వారు ఏదైనా చిన్న చిన్న పనులు చేసేందుకు ముందుకు వస్తే వారికి అండగా నిలవాలి.
దీనివల్ల పిల్లలు సొంతంగా ఎక్కువ విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంటుంది.
పిల్లలు తమ చుట్టూ ఉన్న వారందరూ మంచి వారే అనే అనుకుంటారు. అందుకే బయట అపరిచితులు ఇచ్చిన చాక్లెట్ లు బిస్కెట్లు వంటివి తీసుకోవద్దు అని చెప్పాలి.
మంచి స్నేహితులతో స్నేహం చేయమని చెడు ప్రవర్తన ఉన్న పిల్లలతో దూరంగా ఉండాలని చెప్పాలి.
పిల్లలకు అవసరమయ్యే వస్తువులు మాత్రమే కొనియ్యలి.. లేదంటే డబ్బులు విలువ తెలీదు, వృధా ఖర్చులు చేయడం అలవాటవుతుంది.
పాజిటివ్ గా ఆలోచించడం నేర్పించాలి , యోగా మెడిటేషన్ వంటివి చిన్న వయసునుండే అలవాటు చేయాలి. పిల్లల ముందు తల్లిదండ్రులు ఎట్టిపరిస్థితి లోనూ గొడవలు పడకూడదు, ఒకరినొకరు తిట్టుకోకూడదు, అవమానించుకోకూడదు.
తల్లితండ్రులు ప్రేమగా ఉంటూ వారు కూడా మీతో ప్రేమగా ఉండేలా చూసుకోవాలి.
ఒకరినొకరు గౌరవించుకోవాలి, అసభ్యకరమైన పదాలు అసలు పిల్లల ముందు వాడకూడదు
వారి ముందు అబద్ధాలు అసలు చెప్పకూడదు , అలా చెస్తే పిల్లలు కూడా నేర్చుకొనే అవకాశం ఉంటుంది.
బాధ్యతగా తల్లి తండ్రి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండాలి అలా చెస్తే పిల్లలు కూడా మీ నుంచి మంచి విషయాలను నేర్చుకుంటారు
ముఖ్యంగా పిల్లలను అతి గారాబం చేయకుండా క్రమశిక్షణ తో పెంచాలి
పిల్లలు ఇవి ఏవైనా మంచి పనులు చేస్తునపుడు వారిని ప్రోత్సహిస్తూ ఉండాలి
అబద్ధాలు. చెప్పకుండా తప్పుడు స్నేహాలు చేయకుండా ముందునుండే జాగ్రత్త పడాలి
వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి
కాలి సమయంలో చదువుతోపాటు వేరే యాక్టివిటీ లు కూడా నేర్పించాలి
నీతి కథలు వంటివి చెపుతూ ఉండాలి ఆ కథ ఉండే మంచి విషయాలు చిన్న వయసు నుండే నేర్చుకుంటారు
తల్లి తండ్రులు ఎంత బిజీగా ఉన్నా పిల్లలకు కొంత సమయాన్ని కేటాయించాలి. వారితో ఆడుకోవడం మాట్లాడడం , పార్కులకు తీసుకెళ్తూ ఉండడం వంటివి చేస్తుండాలి
పిల్లలు ఏదైనా విషయాన్ని చెపుతున్నపుడు చాలా ఓపికగా వినాలి , వారు చెప్పే విషయాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.
వారికి మీ అటెన్షన్ వల్లపైన ఉంది అనే విషయాన్ని తెలిసేలా ప్రవర్తించాలి
పిల్లలకు ఏది చెప్పినా ఆప్యాయత తో చెప్పాలే కానీ ఎక్కువగా మందలించడం లాంటివి చేయకూడదు, ఎక్కువగ మందులిస్తే వారు మనింత మొండితనం గా తయారవుతారు
పిల్లలు మీరు చెప్పినట్టు విన్న ప్రతిసారి అభినందిస్తూ ఉండాలి
పిల్లల ఆరోగ్యం చాలా ముఖ్యమైన విషయం కాబట్టి వారికి సరైన పోషకాలు అందే విధంగా ఆహారం ఇవ్వాలి
అలాగే వారి మానసిక ఆరోగ్యం కూడా బాగా చూసుకోవాలి ఎలాంటి ఒత్తిడి కి లోనూ కాకుండా జాగ్రత్త పడాలి మేమున్నాం అనే మనోధైర్యాన్ని పిల్లలకు తల్లి తండ్రులు అందించాలి
ముందుగా పిల్లలు పెద్దవారితో ఎలా మాట్లాడాలో, ఎలా గౌరవించాలి అనే విషయాలు నేర్పించాలి మచిప్రవర్తనా అలవాట్లు నేర్పించాలి
థాంక్స్, సారీ వంటి చిన్న పదాలు చిన్న వయసు నుండే వారికి నేర్పిస్తూ ఉండాలి
మాటల ద్వారా కన్నా బొమ్మలు కథలు చూపిస్తూ మంచి విషయాలు నేర్పిస్తే పిల్లలు త్వరగా నేర్చుకుంటారు
ముఖ్యంగా తల్లి తండ్రులు పిల్లల ముందు మంచి నడవడిక తో ప్రవర్తించాలి , ఎందుకంటే పిల్లలు మొదట గా తల్లితండ్రులను అనుకరిస్తారు
ప్రతి రోజు కొద్దిసేపైన మంచి ప్రవర్తన గురించి పిల్లలకు చిన్నవయసు నుండే నేర్పిస్తే ఆది వారి మెదడులో బలంగా నాటుకుపోతూంది
పిల్లలు తప్పు చేసినపుడు తప్పకుండా చిన్న వయసునుండే అది తప్పు అని చెప్పాలి, లేదంటే అదే వారిలో అలవాటుగా మారుతుంది
విలువలతో కూడిన స్వేచ్ఛ ను వారికి ఇవ్వండి , చిన్నవయసునుండే ఎక్కడ ఎప్పుడూఎవరితో ఎలా ప్రవర్తించాలో అనే విషయం తప్పకుండా నేర్పించాలి ,అలా చెస్తే మంచి నడవడిక అలవాటవుతుంది .
ఇంటి పనులు చేస్తునపుడు వారికి నేర్పిస్తూ సాయం అడగండి చిన్న చిన్న పనులు నేర్చుకుంటారు
ఇద్దరు పిల్లలు ఉన్న ఇంట్లో తప్పకుండా ఇద్దర్ని సమానంగా చూడాలి
పెద్దవారిని ఎక్కువగా మందలిస్తూ, చిన్న వాళ్ళని గారాబం చేయకూడదు
ఇంట్లో పనులు ఏవైనా ఇద్దర్ని కలిసి చేయమని చెప్పాలి ,గొడవ పడకుండా కలిసుండడం నేర్పాలి
ముఖ్యముగా పిల్లలను టీవీ లకు సెల్ ఫోను లకు వీలైనంత దూరంగా ఉంచాలి .ఒకవేళ పిల్లలు అవి వాడుతున్నట్లయితే తల్లితండ్రులు ఎల్లపుడు వారిని గమనిస్తూనే ఉండాలి
పిల్లల ప్రవర్తనును తల్లితండ్రులు ఎప్పుడూ గమనిస్తూనే ఉండాలి, ఏది తప్పు ఏది ఒప్పు అనే విషయాలు పిల్లలకు తెలియదు కాబట్టి తల్లి తండ్రులు ఎప్పటికపుడు పిల్లలకు మంచి విషయాలు నేర్పించాలి https://healthandayurveda.in